కోటంరెడ్డి వ్యాఖ్యలకు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదు.. మ్యాన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. శ్రీధర్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆత్మహత్యాసదృశం అన్నారు. కోర్టులో కేసు వేస్తానని,కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని చెప్పి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. "టీడీపీ అభ్యర్థిగా ఖరారై వచ్చాక కోటంరెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. నిన్నటి వరకు జగన్‌కు విధేయుడిగా ఉన్నాడు.. ఇప్పుడు మరొకరికి విధేయుడిగా మారిపోయాడు" అని పేర్కొన్నారు.
Posted On: February 3, 2023, 11:40 am