‘తెగింపు’ ఓటీటీలోకి వచ్చేస్తోంది!
తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ‘తెగింపు’ సంక్రాంతి కానుకగా రిలీజై ప్రేక్షకుల నుంచి మంచి హిట్ టాక్ అందుకుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీ ఫిబ్రవరి 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.