వివేకా హత్య కేసు..CBI విచారణకు జగన్ ఓఎస్డీ
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణ కొనసాగుతోంది. తాజాగా ఏపీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యారు. అవినాష్ రెడ్డి ఫోన్ కాల్ డేటా ఆధారంగా కృష్ణ మోహన్ రెడ్డితో పాటు నవీన్‌కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో కడప సెంట్రల్ జైలులో సీబీఐ విచారణకు శుక్రవారం వీరిద్దరూ హాజరయ్యారు.