ChotaNews Quick Feeds

రూ.290కోట్ల విలువైన మద్యం, నగదు స్వాధీనం

రూ.290కోట్ల విలువైన మద్యం, నగదు స్వాధీనం

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ రేపు ఉదయం ప్రారంభం కానుంది. ఈక్రమంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటి వరకు రూ.290 కోట్ల విలువైన మద్యం, నగదును ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 27.21 కోట్ల విలువైన నగదు, మద్యాన్ని సీజ్ చేశారు.

ప్రతిరోజూ 12వేల మంది మృతి!

ప్రతిరోజూ 12వేల మంది మృతి!

ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే ప్రతిరోజు వివిధకారణాలతో దాదాపు 12వేల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. వారిలో ఎక్కువగా 5 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారే ఉన్నారని వెల్లడించింది. ఆస్ట్రేలియాలో జరుగుతోన్న ఓ సదస్సులో డబ్ల్యూహెచ్‌వో ఈ వివరాలను తెలిపింది.

వైసీపీ నేతలపై లోకేశ్ పిటిషన్

వైసీపీ నేతలపై లోకేశ్ పిటిషన్

AP: వైసీపీ నేతలపై గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టులో టీడీపీ నేత నారా లోకేశ్ పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో తమపై ఎమ్మెల్సీ పోతుల సునీత, వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ దేవేందర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.

పంజాబ్ సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత!

పంజాబ్ సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత!

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఇంటి ఎదుట కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు. వేతనాల పెంపు సహా తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నిరసన చేపట్టారు. ఈక్రమంలో భగవంత్ మాన్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీఛార్జి చేశారు.