ChotaNews Quick Feeds

‘దానిపై బండి సంజయ్ సమాధానం చెప్పాలి’

‘దానిపై బండి సంజయ్ సమాధానం చెప్పాలి’

TS: బీజేపీపై మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టనని సీఎం కేసీఆర్ ఖరాఖండిగా చెప్పడంతో.. రాష్ట్రానికి రావాల్సిన రూ.6వేల కోట్ల నిధులను ఆపేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తుంటే కేంద్రం ఓర్వలేకపోతోందని విమర్శించారు. కేంద్రం ఈ నిధులను ఆపటంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మా వ్యక్తిగత జీవితాలతో ఆడుకోకండి: నటుడు

మా వ్యక్తిగత జీవితాలతో ఆడుకోకండి: నటుడు

బాలీవుడ్ నటి మలైకా అరోరా ప్రెగ్నెంట్ అంటూ నెట్టింట్లో వార్తలు వైరలవుతున్నాయి. దీనిపై ఓ వెబ్‌సైట్ కథనం రాయడంతో అమె ప్రియుడు అర్జున్ కపూర్ ఫైర్ అయ్యాడు. ‘‘మీరు రాసే వార్త మాకు ఎంత సెన్సిటివ్‌గా అనిపిస్తుందో మీకేం తెలుసు. ఇలాంటి చెత్త వార్తలను ఎలా రాస్తున్నారు. ఫేక్ న్యూస్ రాసి నిజాన్ని నొక్కేస్తున్నారు. మా వ్యక్తిగత జీవితాలతో ఆడుకోకండి’’ అని అన్నాడు.

రూ.290కోట్ల విలువైన మద్యం, నగదు స్వాధీనం

రూ.290కోట్ల విలువైన మద్యం, నగదు స్వాధీనం

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ రేపు ఉదయం ప్రారంభం కానుంది. ఈక్రమంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటి వరకు రూ.290 కోట్ల విలువైన మద్యం, నగదును ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 27.21 కోట్ల విలువైన నగదు, మద్యాన్ని సీజ్ చేశారు.

ప్రతిరోజూ 12వేల మంది మృతి!

ప్రతిరోజూ 12వేల మంది మృతి!

ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే ప్రతిరోజు వివిధకారణాలతో దాదాపు 12వేల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. వారిలో ఎక్కువగా 5 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారే ఉన్నారని వెల్లడించింది. ఆస్ట్రేలియాలో జరుగుతోన్న ఓ సదస్సులో డబ్ల్యూహెచ్‌వో ఈ వివరాలను తెలిపింది.