ChotaNews Quick Feeds

లాభాల్లో సెన్సెక్స్.. నష్టాల్లో నిఫ్టీ

లాభాల్లో సెన్సెక్స్.. నష్టాల్లో నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజూ మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్‌ 224 పాయింట్లు లాభపడి 59,932 వద్ద ముగిసింది. నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో 17,610 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.17గా నిలిచింది. విప్రో, హెచ్‌సీఎల్, టీసీఎస్‌, ఐటీసీ, బ్రిటానియా షేర్లు లాభపడ్డాయి.

వామ్మో ఆ బుడ్డోడి బరువు ఎంతంటే?

వామ్మో ఆ బుడ్డోడి బరువు ఎంతంటే?

బ్రెజిల్​లో ఓ మహిళ 7.3 కిలోల బరువున్న శిశువుకు జన్మనిచ్చింది. బ్రెజిల్​లోని పరేడ్ కొలంబో ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. వైద్యులు సిజేరియన్ ద్వారానే మహిళకు ప్రసవం చేశారు. నవజాత శిశువు 7.3 కిలోల బరువుండడంతో పాటుగా 2 ఫీట్ల ఎత్తు కూడా ఉండడం గమనార్హం. సాధారణంగా పుట్టిన పిల్లలు 3.5 కిలోల లోపే ఉంటారు.

పొంగులేటి మాటిచ్చారు: షర్మిల

పొంగులేటి మాటిచ్చారు: షర్మిల

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి YSRTPలో చేరతానని మాట ఇచ్చారని ఆ పార్టీ చీఫ్ షర్మిల వెల్లడించారు. త్వరలోనే ఆయన చేరిక ఉంటుందని తెలిపారు. లా అండ్ ఆర్డర్ పేరుతో తన పాదయాత్రను అధికార పార్టీ అడ్డుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంలో సమస్యలు లేవని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని తెలిపారు. లేదంటే కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.