ChotaNews Quick Feeds

అభ్యర్థులకు కీలకమైనవి ఇవే

అభ్యర్థులకు కీలకమైనవి ఇవే

ఎన్నికలు రాగానే రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేస్తాయి. ఏదైనా ఒక రాజకీయ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థికి సదరు పార్టీ ఫాం-A, ఫాం-B అందించాల్సి ఉంటుంది. ఆయా రాజకీయ పార్టీల అధ్యక్షుడి సంతకాలతో కూడిన ఫాంలను అభ్యర్థులు ఎన్నికల అధికారులకు సమర్పించాలి. అప్పుడే అభ్యర్థులు ఆయా పార్టీల తరఫున బరిలో నిలిచినట్లు పరిగణిస్తారు.

ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే సూప‌ర్ బాల్‌!

ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే సూప‌ర్ బాల్‌!

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో గురువారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో పంబాజ్ బ్యాటర్ రిలే రూసోను అద్బుతమైన యార్కర్‌తో ముంబై బౌలర్ బుమ్రా క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు.

గిన్నిస్‌బుక్‌లో చోటు సాధించిన అజయ్‌కుమార్‌

గిన్నిస్‌బుక్‌లో చోటు సాధించిన అజయ్‌కుమార్‌

HYD: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల SME ఛాంబర్స్‌ ఆఫ్‌ ఇండియా సలహాదారు డాక్టర్‌ అజయ్‌కుమార్‌ అగర్వాల్‌ గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లో రెడ్‌క్రాస్‌ సొసైటీ తెలంగాణ ఛైర్మన్‌ అజయ్‌మిశ్రాతో కలిసి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అజయ్‌మిశ్రా మాట్లాడుతూ 23మంది పాజిటివ్‌ ఛేంజ్‌మేకర్స్‌ ఇన్‌ ది వరల్డ్‌లో డాక్టర్‌ అజయ్‌కుమార్‌ పేరు చేర్చడం గర్వకారణమని అన్నారు.