రేపు గుడివాడకు సీఎం జగన్
AP: సీఎం జగన్ రేపు కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గుడివాడ మండలం మల్లాయపాలెం చేరుకుని అక్కడి టిడ్కో గృహ సముదాయాన్ని ప్రారంభించి దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తిరిగి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.