4 వ్యాధులతో జాగ్రత్త

4 వ్యాధులతో జాగ్రత్త

4 వ్యాధులతో జాగ్రత్త

ChotaNews Quick Feeds

కామ్రేడ్స్ మా దోస్తులే!: రేవంత్ రెడ్డి

కామ్రేడ్స్ మా దోస్తులే!: రేవంత్ రెడ్డి

TS: మునుగోడు నియోజకవర్గంలోని జనగాం గ్రామంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కమ్యూనిస్టులు తమకు సహజ మిత్రులని చెప్పారు. కమ్యూనిస్టులను తానెప్పుడూ కించపరిచేలా మాట్లాడలేదని, అవమానించినట్లు నిరూపిస్తే ధర్మ భిక్షం విగ్రహం ముందు ముక్కు నేలకు రాస్తానని చెప్పారు. కమ్యూనిస్టు అగ్రనేతలు ఎవరికి సపోర్ట్ చేసినా… ఆ పార్టీ కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్‌కు అండగా నిలవాలని రేవంత్ కోరారు.

BREAKING: సిరీస్ మనదే

BREAKING: సిరీస్ మనదే

ఉప్పల్‌లో టీమిండియా అదరగొట్టింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని భారత్ 4 వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలోనే ఛేధించింది. బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ (69), కోహ్లీ (63) హాఫ్ సెంచరీలు, హార్ధిక్ (25నాటౌట్)తో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

రాజస్థాన్ కాంగ్రెస్‌లో రాజుకున్న కుంపటి

రాజస్థాన్ కాంగ్రెస్‌లో రాజుకున్న కుంపటి

రాజస్థాన్‌లో సీఎం అశోక్ గెహ్లాట్ రాజీనామా అనంతరం తదుపరి ముఖ్యమంత్రి ఎన్నిక విషయంలో రాజకీయ సంక్షోభం దిశగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సచిన్ పైలట్‌ను సీఎంగా ఎన్నుకుంటే 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని గెహ్లాట్ వర్గీయులు కాంగ్రెస్ అధిష్ఠానానికి తేల్చిచెప్పారు. మరోవైపు అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు ఈనెల 28న నామినేషన్ వేసేందుకు సిద్ధం అవుతున్నారు.

కేంద్రం ఆఫర్‌‌కు ముకుల్‌ రోహత్గీ నో!

కేంద్రం ఆఫర్‌‌కు ముకుల్‌ రోహత్గీ నో!

సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి మరోసారి అటార్నీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ వస్తోన్న వార్తలపై ఆయన స్పందించారు. తదుపరి ఏజీగా బాధ్యతలు చేపట్టాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్‌ని తిరస్కరించినట్టు వెల్లడించారు. ఈ నిర్ణయం వెనుక ప్రత్యేక కారణమేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏజీగా కొనసాగుతున్న కేకే వేణుగోపాల్‌ (91) పదవీ కాలం ఈ నెల 30తో ముగియనుంది.