గోదావరి నదికి కేసీఆర్ హారతి
TS: గోదావరిఖని బ్రిడ్జి వద్ద గోదావరి నదికి సీఎం కేసీఆర్ హారతి ఇచ్చారు. మంచిర్యాల జిల్లాలో తన పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా, పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని పట్టణంలో కేసీఆర్ ఆగారు. అక్కడ గోదావరి హారతి కార్యక్రమంలో పాల్గొని గోదారికి కేసీఆర్ పూజలు చేశారు.