జ‌లుబుతో ముక్కు మూసుకుపోయిందా?

జ‌లుబుతో ముక్కు మూసుకుపోయిందా?

కొన్నిసార్లు దగ్గు, జలుబు, సైనస్‌ కారణంగా ముక్కు మూసుకుపోతుంది. ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు కొన్ని వంటింటి చిట్కాలు పాటిస్తే సరి. ఆవాల నూనెను వాసన చూడండి. ముక్కు దగ్గర ఆవాల నూనెతో మర్దనా చేస్తే.. ఆ ఘాటుకు ముక్కులోని శ్లేష్మం బయటికి వస్తుంది. యూకలిప్టస్‌ పూలను వేడినీటిలో వేసి, ఆవిరి పడితే త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఉల్లిపాయను దంచి వాసన చూడండి.

ChotaNews Quick Feeds

BREAKING: సిరీస్ మనదే

BREAKING: సిరీస్ మనదే

ఉప్పల్‌లో టీమిండియా అదరగొట్టింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని భారత్ 4 వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలోనే ఛేధించింది. బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ (69), కోహ్లీ (63) హాఫ్ సెంచరీలు, హార్ధిక్ (25నాటౌట్)తో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

రాజస్థాన్ కాంగ్రెస్‌లో రాజుకున్న కుంపటి

రాజస్థాన్ కాంగ్రెస్‌లో రాజుకున్న కుంపటి

రాజస్థాన్‌లో సీఎం అశోక్ గెహ్లాట్ రాజీనామా అనంతరం తదుపరి ముఖ్యమంత్రి ఎన్నిక విషయంలో రాజకీయ సంక్షోభం దిశగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సచిన్ పైలట్‌ను సీఎంగా ఎన్నుకుంటే 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని గెహ్లాట్ వర్గీయులు కాంగ్రెస్ అధిష్ఠానానికి తేల్చిచెప్పారు. మరోవైపు అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు ఈనెల 28న నామినేషన్ వేసేందుకు సిద్ధం అవుతున్నారు.

కేంద్రం ఆఫర్‌‌కు ముకుల్‌ రోహత్గీ నో!

కేంద్రం ఆఫర్‌‌కు ముకుల్‌ రోహత్గీ నో!

సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి మరోసారి అటార్నీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ వస్తోన్న వార్తలపై ఆయన స్పందించారు. తదుపరి ఏజీగా బాధ్యతలు చేపట్టాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్‌ని తిరస్కరించినట్టు వెల్లడించారు. ఈ నిర్ణయం వెనుక ప్రత్యేక కారణమేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏజీగా కొనసాగుతున్న కేకే వేణుగోపాల్‌ (91) పదవీ కాలం ఈ నెల 30తో ముగియనుంది.

ఉప్పల్‌లో మరోసారి రెచ్చిపోయిన కోహ్లీ

ఉప్పల్‌లో మరోసారి రెచ్చిపోయిన కోహ్లీ

హైదరాబాద్‌ అభిమానుల్లో జోష్ పెంచుతూ కోహ్లీ ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో అర్థశతకం సాధించాడు. 37 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు, మూడు సిక్సులు ఉన్నాయి. ఉప్పల్ స్టేడియంలో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ కోహ్లీ పేరు మీద ఉంది. గతంలో విండీస్‌పై టీ20 మ్యాచ్‌లో 94 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.