ఏఐ టూల్స్‌ను వినియోగించనున్న Zomato, Blinkit
పలు కంపెనీలు మెరుగైన సేవలు అందించేందుకు ఇంటరాక్టివ్ ఏఐ టూల్స్‌ను వాడుతుండడం తెలిసిందే. త్వరలో ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌లు Zomato, Blinkit సైతం తమ సర్వీసులను మెరుగుపరిచేందుకు ఏఐ టూల్స్ వాడనున్నాయి. దీనిలోభాగంగా పెద్దసంఖ్యలో ఇంజనీర్లు, డేటా సైంటిస్ట్‌లను రిక్రూట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. సెర్చ్, నోటిఫికేషన్స్ వంటి పలు కస్టమర్ సేవలతోపాటు ప్రోడక్ట్ ఫొటోగ్రఫీ, కస్టమర్ సపోర్ట్‌లో దీనిని వినియోగించనుంది.