ChotaNews Quick Feeds

వైసీపీ నేతలపై లోకేశ్ పిటిషన్

వైసీపీ నేతలపై లోకేశ్ పిటిషన్

AP: వైసీపీ నేతలపై గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టులో టీడీపీ నేత నారా లోకేశ్ పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో తమపై ఎమ్మెల్సీ పోతుల సునీత, వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ దేవేందర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.

పంజాబ్ సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత!

పంజాబ్ సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత!

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఇంటి ఎదుట కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు. వేతనాల పెంపు సహా తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నిరసన చేపట్టారు. ఈక్రమంలో భగవంత్ మాన్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీఛార్జి చేశారు.

7న బీసీల ఆత్మీయ సమావేశం

7న బీసీల ఆత్మీయ సమావేశం

AP: బీసీలపై వైసీపీ ఫోకస్ పెంచింది. డిసెంబర్ 8న బీసీల ఆత్మీయ సదస్సు జరగాల్సి ఉండగా.. ఒకరోజు ముందుగా డిసెంబర్ 7న జరపాలని నిర్ణయించింది. విజయవాడలోని ఇంధిరాగాంధీ స్టేడియంలో జరగనున్న ఈ సదస్సుకు 60 వేల నుంచి 75 వేల మంది హాజరయ్యే అవకాశం ఉంది. సీఎం జగన్ ఈ సదస్సులో బీసీ నేతలను ఉద్ధేశించి మాట్లాడనున్నారు.

పాపులారిటీతోనూ సమస్యలు: విజయ్ దేవరకొండ

పాపులారిటీతోనూ సమస్యలు: విజయ్ దేవరకొండ

ఈడీ విచారణ అనంతరం హీరో విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాపులారిటీ వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తాయని, అందులో ఇదొకటని వెల్లడించారు. ఈడీ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తూ, పూర్తిగా సహకరించానని తెలిపారు. తనను మళ్లీ రమ్మని ఈడీ అధికారులు చెప్పలేదన్నారు.