ChotaNews Quick Feeds

చాగంటికి గురజాడ పురస్కారం

చాగంటికి గురజాడ పురస్కారం

AP: ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును గురజాడ పురస్కారం వరించింది. నవంబర్‌ 30న గురజాడ వర్ధంతిని పురస్కరించుకొని నిర్వాహకులు..ఈ ఏడాది చాగంటికి పురస్కారాన్ని ప్రదానం చేయాలని నిర్ణయించామన్నారు. ఈ పురస్కారం ఆయనకు ఇవ్వడం విజయనగరం వాసులకు గొప్పవరంగా భావిస్తున్నామన్నారు. చాగంటి మాట్లాడుతూ..'దీనిని గురజాడ పురస్కారంగా భావించడం లేదు. ఆయన ఆశీస్సులుగా భావిస్తున్నాను. అందుకే అవార్డు స్వీకరించడానికి సిద్ధపడ్డా' అని అన్నారు.

సమంత ఆరోగ్యంపై క్లారిటీ

సమంత ఆరోగ్యంపై క్లారిటీ

ప్రముఖ సినీనటి సమంత ఆరోగ్యం మరోసారి క్షీణించిందంటూ నెట్టింట కథనాలు వెలువడ్డాయి. దీంతో ఆమె టీం స్పందించింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టంచేసింది. సామ్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఖండిస్తూ అవాస్తవాలను ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేసింది.

TTD పాలకమండలి కీలక నిర్ణయాలు

TTD పాలకమండలి కీలక నిర్ణయాలు

AP: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయం స్వర్ణమయం చేయాలని, అందుకు భక్తులు విరాళంగా ఇచ్చిన బంగారంతో తాపడం చేయించాలని నిర్ణయించింది. జనవరి 2, 2023 నుంచి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం మొదలుకానుంది. 11వ తేదీ వరకు భక్తులను వైకుంఠ ద్వారా దర్శనానికి టీటీడీ అనుమతించనుంది.

‘ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తాం’

‘ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తాం’

ద్రవ్యోల్బణాన్ని సమర్థంగా అదుపు చేయడంలో భారత్‌ విజయం సాధిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ధీమా వ్యక్తంచేశారు. ఆహార పదార్థాల ధరల అదుపునకు సరఫరా అవరోధాలను అధిగమించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వచ్చే ఏడాది మొదట్లో గానీ, వచ్చే ఏడాది మధ్య నాటికి ద్రవ్యోల్బణం దిగి వస్తుందని చెప్పారు. వచ్చే ఏడాదికి వృద్ధి పథంలో భారత్‌ దూసుకెళుతుందన్నారు.