ChotaNews Quick Feeds

రవీంద్ర జడేజాకు లైన్ క్లియర్.. కానీ

రవీంద్ర జడేజాకు లైన్ క్లియర్.. కానీ

టీమిండియా ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా ఆసీస్​తో టెస్టు సిరీస్​లో పాల్గొనేందుకు లైన్ క్లియర్ అయింది. నాగ్​పూర్​లో ఆసీస్​తో జరిగే మొదటి టెస్టు ఆడనున్నాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ విషయంలో మాత్రం NCA ఇంకా ఎటువంటి రిపోర్ట్ ఇవ్వలేదు. జడ్డూ చాలా రోజుల నుంచి టీమిండియా తరఫున ఆడడం లేదు. ఈ 34ఏళ్ల ఆల్​రౌండర్ చివరిసారిగా ఇండియా తరఫున 2022లో బరిలోకి దిగాడు.

ఆ హీరోతో రొమాన్స్ చేయనున్న మృణాల్!

ఆ హీరోతో రొమాన్స్ చేయనున్న మృణాల్!

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. ‘సీతారామం’తో మంచిక్రేజ్ సంపాదించుకున్న ఈ భామకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ హీరో అక్కినేని నాగార్జునతో జతకట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. నాగార్జున-బెజవాడ ప్రసన్న కుమార్ కాంబోలో ఓ సినిమా రూపొందుతుంది. ఈ మూవీలో హీరోయిన్‌గా మృణాల్‌ను సెలెక్ట్ చేసినట్లు సమాచారం.

షర్మిలపై షూపై పెద్ది సుదర్శన్ కౌంటర్

షర్మిలపై షూపై పెద్ది సుదర్శన్ కౌంటర్

సీఎం కేసీఆర్‌కు YSRTP చీఫ్ షర్మిల షూ పంపడంపై నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందించారు. షర్మిల కొత్తగా షూ కంపెనీ పెట్టిందా అని సెటైర్ వేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏనాడూ ఇంత చిల్లరగా మాట్లాడలేదని అన్నారు. కానీ ఆయన కూతురు మాత్రం ఇప్పుడు ఇలాంటి కామెంట్లు చేయడం ఏంటని ప్రశ్నించారు.