సచివాలయం వద్ద హైడ్రామా!
తెలంగాణ నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదంపై హైడ్రామా కొనసాగుతోంది. అది కేవలం మాక్ డ్రిల్ అంటూ అధికారులు చెబుతున్నారు. అయితే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాత్రం స్వల్ప ప్రమాదమని వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న కాంగ్రెస్ నేతలు సచివాలయం వైపు బయల్దేరారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. సచివాలయం నిర్మాణంలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.