ChotaNews Quick Feeds

రవీంద్ర జడేజాకు లైన్ క్లియర్.. కానీ

రవీంద్ర జడేజాకు లైన్ క్లియర్.. కానీ

టీమిండియా ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా ఆసీస్​తో టెస్టు సిరీస్​లో పాల్గొనేందుకు లైన్ క్లియర్ అయింది. నాగ్​పూర్​లో ఆసీస్​తో జరిగే మొదటి టెస్టు ఆడనున్నాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ విషయంలో మాత్రం NCA ఇంకా ఎటువంటి రిపోర్ట్ ఇవ్వలేదు. జడ్డూ చాలా రోజుల నుంచి టీమిండియా తరఫున ఆడడం లేదు. ఈ 34ఏళ్ల ఆల్​రౌండర్ చివరిసారిగా ఇండియా తరఫున 2022లో బరిలోకి దిగాడు.

వారెవ్వా.. కిర్రాక్ ఆఫర్!

వారెవ్వా.. కిర్రాక్ ఆఫర్!

ఫ్లిప్‌కార్ట్‌లో Beethosol 43ఇంచుల స్మార్ట్‌టీవీపై కళ్లుచెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. దీని ధర రూ.41,990 ఉండగా.. దీన్ని ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ బచత్ ధమాల్ సేల్‌లో కేవలం రూ.14,099కే సొంతం చేసుకోవచ్చు. అంటే ఈ స్మార్ట్‌టీవీపై నేరుగా 66శాతం తగ్గింపు లభిస్తుంది.అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5శాతం (రూ.705)వరకు క్యాష్‌బ్యాక్ ఉంటుంది. అప్పుడు ఈ టీవీ రూ.13,394కే కొనుక్కోవచ్చు.

ఉద్యోగులకు బైజూస్ మరోసారి షాక్

ఉద్యోగులకు బైజూస్ మరోసారి షాక్

ప్రముఖ ఈడీటెక్ సంస్థ బైజూస్ తన ఉద్యోగులకు మరోసారి షాకిచ్చింది. సంస్థ ఖర్చు తగ్గించేందుకు మరో 1000-1200మందిని తొలగించినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. ఇంజనీరింగ్, సేల్స్, లాజిస్టిక్స్, మార్కెటింగ్, కమ్యునికేషన్ టీమ్స్‌ నుంచి ఈ తొలగింపులు చేపట్టినట్లు నివేదిక పేర్కొంది. అయితే ఇటీవల గతేడాది సెప్టెంబర్‌లో 5శాతం ఉద్యోగులను తొలగించిన తర్వాత మళ్లీ ఉద్యోగులను తొలగించే ఆలోచనలో లేమని సంస్థ సీఈఓ రవీంద్రన్ పేర్కొన్నారు.