లాభాల్లో సెన్సెక్స్.. నష్టాల్లో నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 224 పాయింట్లు లాభపడి 59,932 వద్ద ముగిసింది. నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో 17,610 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.17గా నిలిచింది. విప్రో, హెచ్సీఎల్, టీసీఎస్, ఐటీసీ, బ్రిటానియా షేర్లు లాభపడ్డాయి.