భారత్-ఆసీస్ టెస్టు మ్యాచ్ వీక్షించనున్న మోదీ
భారత్-ఆస్ట్రేలియా జట్లు నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో ఆఖరి టెస్టు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌ను ప్రధాని మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రత్యక్షంగా వీక్షించనున్నట్లు సమాచారం.