‘అలాంటి వార్తలపై వ్యాఖ్యానించలేం’
అమెరికా అద్యక్షుడు బైడెన్.. భారత ప్రధాని మోదీని అమెరికా పర్యటనకు ఆహ్వానించారని, అందుకు మోదీ అంగీకరించారని వస్తున్న వార్తలపై తాజాగా కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పందించారు. ఇటువంటి మీడియా రిపోర్ట్‌లపై, వార్తలపై తాము వ్యాఖ్యానించలేమని చెప్పారు. కానీ సరైన సమయం వచ్చినప్పుడు తాము అధికారికంగా హైలెవెల్ పర్యటనను ప్రకటిస్తామని తెలిపారు.