ChotaNews Quick Feeds

నేడు దిగ్విజయ్, థరూర్ నామినేషన్

నేడు దిగ్విజయ్, థరూర్ నామినేషన్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. నామినేషన్ పక్రియ ముగింపు దశకు చేరుకుంది. దీంతో నేడు సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, శశిథరూర్ నామినేషన్ వేయనున్నారు. అశోక్ గెహ్లాట్ చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకోవడంతో ఈ ఇద్దరు మాత్రమే బరిలో ఉండనున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ 17న ఓటింగ్ జరగనుంది.

ఆసక్తిగా మారిన కేసీఆర్ యాదాద్రి టూర్

ఆసక్తిగా మారిన కేసీఆర్ యాదాద్రి టూర్

సీఎం కేసీఆర్‌ నేడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోనున్నారు. సతీసమేతంగా వెళ్తున్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం బంగారాన్ని విరాళంగా సమర్పిస్తారు. దసరాకు జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటన ఉండే నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. అధికారులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.