ChotaNews Quick Feeds

రవీంద్ర జడేజాకు లైన్ క్లియర్.. కానీ

రవీంద్ర జడేజాకు లైన్ క్లియర్.. కానీ

టీమిండియా ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా ఆసీస్​తో టెస్టు సిరీస్​లో పాల్గొనేందుకు లైన్ క్లియర్ అయింది. నాగ్​పూర్​లో ఆసీస్​తో జరిగే మొదటి టెస్టు ఆడనున్నాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ విషయంలో మాత్రం NCA ఇంకా ఎటువంటి రిపోర్ట్ ఇవ్వలేదు. జడ్డూ చాలా రోజుల నుంచి టీమిండియా తరఫున ఆడడం లేదు. ఈ 34ఏళ్ల ఆల్​రౌండర్ చివరిసారిగా ఇండియా తరఫున 2022లో బరిలోకి దిగాడు.

అఖిలేష్​కు ల్యాండింగ్ పర్మిషన్ నిరాకరణ..

అఖిలేష్​కు ల్యాండింగ్ పర్మిషన్ నిరాకరణ..

సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ శనివారం మొరాదాబాద్‌లో పర్యటించేందుకు అంతా సిద్ధమైంది. కానీ అనూహ్యంగా మొరాదాబాద్ కలెక్టర్ అఖిలేష్ హెలికాప్టర్ ల్యాండింగ్​కు పర్మిషన్ ఇవ్వలేదు. హెలిపాడ్ ప్రస్తుతం రిన్నోవేషన్​లో ఉందని ఆయన తెలిపాడు. దీనిపై సమాజ్​వాదీ కార్యకర్తలు భగ్గుమంటున్నారు.

ట్యాపింగ్‌పై వివరణ ఇవ్వాలి : పవన్

ట్యాపింగ్‌పై వివరణ ఇవ్వాలి : పవన్

ఏపీలో ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్‌పై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని జనసేనాని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేరుగా సీఎం కార్యాలయంపైనే విమర్శలు చేయడంపై జగన్ స్పందించాలని కోరారు. ఆనం రాంనారాయణ రెడ్డికి ఉద్దేశపూర్వకంగానే భద్రత తగ్గించారని ఆరోపించారు. ఆయన ప్రాణానికి ముప్పు వాటిల్లితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.