నెల్లూరు రూరల్ YCP ఇంచార్జి ప్రకటన
నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి వైసీపీ కొత్త ఇంచార్జిని ప్రకటించింది. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారు. ఆయనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. కాగా, ఇప్పటి వరకు ఇంచార్జిగా ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ అధిష్టానంపై దిక్కార స్వరం వినిపించడంతో ఆయన్ను బాధ్యతల నుంచి తప్పించారు.