ChotaNews Quick Feeds

రవీంద్ర జడేజాకు లైన్ క్లియర్.. కానీ

రవీంద్ర జడేజాకు లైన్ క్లియర్.. కానీ

టీమిండియా ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా ఆసీస్​తో టెస్టు సిరీస్​లో పాల్గొనేందుకు లైన్ క్లియర్ అయింది. నాగ్​పూర్​లో ఆసీస్​తో జరిగే మొదటి టెస్టు ఆడనున్నాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ విషయంలో మాత్రం NCA ఇంకా ఎటువంటి రిపోర్ట్ ఇవ్వలేదు. జడ్డూ చాలా రోజుల నుంచి టీమిండియా తరఫున ఆడడం లేదు. ఈ 34ఏళ్ల ఆల్​రౌండర్ చివరిసారిగా ఇండియా తరఫున 2022లో బరిలోకి దిగాడు.

ఆ సినిమా ఖచ్చితంగా చూస్తానన్న మహేష్ బాబు!

ఆ సినిమా ఖచ్చితంగా చూస్తానన్న మహేష్ బాబు!

సుహాస్‌ నటిస్తున్న తాజాచిత్రం ‘రైటర్‌ పద్మభూషణ్‌’. షణ్ముఖ ప్రశాంత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకానుంది. తాజాగా ఈ మూవీ టీంకు మహేష్ బాబు విషెస్ చెప్పాడంట. అంతేకాకుండా ఫిబ్రవరి 4న ఈ సినిమా ఖచ్చితంగా చూస్తానని మహేష్ బాబు, సుహాస్‌తో అన్నాడని ఇన్‌సైడ్ టాక్ వినిపిస్తోంది.

‘అలాంటి వార్తలపై వ్యాఖ్యానించలేం’

‘అలాంటి వార్తలపై వ్యాఖ్యానించలేం’

అమెరికా అద్యక్షుడు బైడెన్.. భారత ప్రధాని మోదీని అమెరికా పర్యటనకు ఆహ్వానించారని, అందుకు మోదీ అంగీకరించారని వస్తున్న వార్తలపై తాజాగా కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పందించారు. ఇటువంటి మీడియా రిపోర్ట్‌లపై, వార్తలపై తాము వ్యాఖ్యానించలేమని చెప్పారు. కానీ సరైన సమయం వచ్చినప్పుడు తాము అధికారికంగా హైలెవెల్ పర్యటనను ప్రకటిస్తామని తెలిపారు.