ChotaNews Quick Feeds

నిఖత్ జరీన్​కు సువర్ణావకాశం

నిఖత్ జరీన్​కు సువర్ణావకాశం

NMDC బ్రాండు అంబాసిడర్​గా బాక్సింగ్ చాంపియన్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ వ్యవహరించనుంది. దేశ నిర్మాణంలో కీ రోల్ పోషిస్తున్న NMDC బ్రాండును ముందుకు తీసుకెళ్లేందుకు నిఖత్ జరీన్ దోహదపడుతుందని ఆశిస్తున్నట్లు సంస్థ సీఎండీ సుమిత్ దేబ్ తెలిపారు. వచ్చే ఒలంపిక్ పోటీల్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించే నిఖత్​కు అన్ని విధాలా మద్దతు ఇస్తామని ఆయన పేర్కొన్నారు.

మార్చిలోనే ఏపీ బడ్జెట్ సమావేశాలు

మార్చిలోనే ఏపీ బడ్జెట్ సమావేశాలు

మార్చి 2వ వారంలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం అన్నీ తయారు చేసుకుంటున్నట్లు సమాచారం. మార్చి 3,4 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్​ తర్వాతే బడ్జెట్ సమావేశాలు ఉండనున్నట్లు వినికిడి.

భారీగా గ్రూప్4 దరఖాస్తులు

భారీగా గ్రూప్4 దరఖాస్తులు

గ్రూప్ 4 పోస్టులకు దరఖాస్తు చేసుకునే నిరుదోగ్యుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. టీఎస్​పీఎస్సీ మరో 141 పోస్టులను చేర్చడంతో మొత్తం పోస్టుల సంఖ్య 8,180కి చేరుకుంది. 2018లో గ్రూప్​4 దరఖాస్తుల సంఖ్య 4.8 లక్షలు మాత్రమే. కానీ ఈ సారి ఆ సంఖ్య భారీగా పెరగడం విశేషం.