ChotaNews Quick Feeds

మరో రికార్డును ఖాతాలో వేసుకున్న పఠాన్

మరో రికార్డును ఖాతాలో వేసుకున్న పఠాన్

బాలీవుడ్ బాద్​షా షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్ మూవీ కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తుంది. రిలీజ్ అయిన వారాంతంలో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన సినిమాగా పఠాన్ రికార్డు నెలకొల్పింది. ఇండియాలో రూ. 201 కోట్ల గ్రాస్, ఓవర్సీస్​లో రూ. 112 కోట్లు వసూలు చేసినట్లు యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రకటించింది.

‘అర్షదీప్ ఇంకా నో బాల్స్ వేయడం అతి పెద్ద ఆందోళన’

‘అర్షదీప్ ఇంకా నో బాల్స్ వేయడం అతి పెద్ద ఆందోళన’

తొలి టీ20 చివరి ఓవర్​లో స్ట్రైక్ బౌలర్ అర్షదీప్ సింగ్ 27 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఓవర్​లో అర్షదీప్ నో బాల్ వేసి.. ఫ్రీ హిట్​లో కూడా సిక్సర్ సమర్పించుకున్నాడు. దీనిపై టీమిండియా మాజీ బౌలర్​ లక్ష్మీపతి బాలాజీ స్పందించాడు. అర్షదీప్ ఇంకా నో బాల్స్ వేయడం అతి పెద్ద ఆందోళనను కలిగిస్తుంది. అతడు ఈ విషయం మీద మరింత సాధన చేయాలని తెలిపాడు.

‘బాబర్ అజమ్ కంటే కోహ్లీనే బెటర్’

‘బాబర్ అజమ్ కంటే కోహ్లీనే బెటర్’

పాక్ కెప్టెన్ బాబర్ అజమ్, టీమిండియా రన్ మెషీన్ విరాట్​ కోహ్లీలలో అత్యుత్తమ బ్యాటర్​ను ఎంచుకోమని టీమిండియా మాజీ ఆటగాడు అజారుద్దీన్​ని ప్రశ్నించగా.. తాను కోహ్లీనే ఎంచుకుంటానని తెలిపాడు. ‘‘కోహ్లీ అనుభవజ్ఞుడైన ప్లేయర్, అతడు చేసిన పరుగుల సంఖ్య పెద్దది. అంతర్జాతీయ కెరీర్​లో ఇప్పటికే 74 సెంచరీలు, 129 హాఫ్ సెంచరీలతో 24,936 పరుగులు చేశాడని పేర్కొన్నాడు.