‘జాబ్ క్యాలెండర్ ఏది జగన్ గారు’
చిన్న మధ్య తరగతి పరిశ్రమలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కొత్త కంపెనీ అయినా వచ్చిందా? ఒక్క సారైనా జాబ్ క్యాలెండర్ విడుదల చేశారా? అని ప్రశ్నించారు. లోకేష్ పాదయాత్ర నేటికి 7వ రోజుకు చేరుకుంది. చిత్తూరు జిల్లా పలమనేరులో లోకేష్‌ను న్యాయవాదులు కలిశారు.