జగన్ పేరు విని పారిపోతున్న కంపెనీలు: లోకేశ్
AP: టీడీపీ యువనేత నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా పలమనేరు క్లాక్ టవర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో లోకేశ్ పాల్గొన్నారు. సీఎం జగన్ను చూసి రాష్ట్రంలో ఉన్న కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయన్నారు. రాష్ట్రంలో ఒక్క కొత్త కంపెనీ వచ్చిందా? ఒక్కరికైనా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా అని ప్రశ్నించారు. టమోటా, పట్టు రైతులకు గిట్టుబాటు ధర అందిస్తామని హామీ ఇచ్చారు.