ChotaNews Quick Feeds

సర్వే సంస్థలకు బిగ్‌ షాక్‌..!

సర్వే సంస్థలకు బిగ్‌ షాక్‌..!

నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో అన్నిరకాల సర్వేలకు పుల్‌స్టాప్‌ పడినట్లేనని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఏ సంస్థ, ఏ వ్యక్తి గానీ ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి సర్వేలను ప్రజలకు వెల్లడించకూడదని వార్నింగ్‌ ఇచ్చింది. ప్రీపోల్‌ సర్వే, ఒపినియన్‌ పోల్‌ సర్వే, అంశాల వారీ సర్వే సహా ఎలాంటి సర్వేల వెల్లడికి అనుమతి లేదని ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది.

తెలంగాణ ఓటర్లకు బిగ్‌ షాక్‌!

తెలంగాణ ఓటర్లకు బిగ్‌ షాక్‌!

TG : రాష్ట్రంలో మే 13వ తేదీన పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ జరుగనుంది. సాయంత్రం 5గంటల వరకే పోలింగ్ ఉండనుంది. అటు APసహా మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం సాయంత్రం 6గంటలవరకు పోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ ఉండడంతో భారీగా పోలింగ్ శాతం తగ్గనుంది. తెలంగాణలో కూడా సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ పొడిగించాలని రాజకీయ పార్టీల నేతలు కోరుతున్నారు.

రాహుల్ స్పూన్‌ ఫీడింగ్‌ కిడ్‌: గులాం నబీఆజాద్

రాహుల్ స్పూన్‌ ఫీడింగ్‌ కిడ్‌: గులాం నబీఆజాద్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆ పార్టీ మాజీ నేత గులాం నబీఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ‘స్పూన్‌ ఫీడింగ్ కిడ్స్’ అని ఎద్దేవా చేశారు. ‘‘వారిద్దరు వ్యక్తిగతంగా ఎలాంటి త్యాగాలు చేయలేదు. రాజకీయ వారసత్వాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. సొంతంగా చేసిందేమీ లేదు’’ అని విమర్శించారు.