ChotaNews Quick Feeds

అవి బ్యాటర్లకు వరంలా మారాయి: బుమ్రా

అవి బ్యాటర్లకు వరంలా మారాయి: బుమ్రా

నిన్న పంజాబ్‌తో అనంతరం ముంబై స్టార్ పేసర్ బుమ్రా మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20ల్లో బ్యాటర్లదే పైచేయి అని, బౌలర్లకు చాలా కఠినమైన ఫార్మాట్‌ అని తెలిపాడు. టైమ్‌ నిబంధనలతో పాటు ఇంపాక్ట్‌ రూల్‌ కూడా బ్యాటర్లకు వరంలా మారిందని, వాటితో బౌలర్లను ఆటాడుకుంటున్నారని పేర్కొన్నాడు. కాగా బుమ్రా తన 4 ఓవర్ల కోటాలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి.. 3 వికెట్లను పడగొట్టాడు.

పోలీంగ్ సరళిని పరిశీస్తున్న ఈసీఈ

పోలీంగ్ సరళిని పరిశీస్తున్న ఈసీఈ

దేశంలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ సరళిని సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్(CEC) రాజీవ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ బూత్‌లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా పోలింగ్‌ను పరిశీలిస్తున్నారు.

సమస్యలకు మూల కారణం వారే: యోగి ఆదిత్యనాథ్

సమస్యలకు మూల కారణం వారే: యోగి ఆదిత్యనాథ్

బులంద్‌షహర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘‘భారత్‌లో సమస్యలకు మూలకారణం కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీలే. ఆ సమస్యలకు పరిష్కారం బీజేపీ. వాళ్ళు ఆర్టికల్ 370 తీసుకొస్తే.. మేము దానిని రద్దు చేసి, ఉగ్రవాదాన్ని అంతం చేశాం. ఇప్పుడు పేలుళ్లు లేవు, అల్లర్లు లేవు. ఇప్పుడు పేలుళ్లు జరిగితే ఉగ్రవాదులు అంతం అవుతారు’’ అని అన్నారు.