ChotaNews Quick Feeds

ఇంటర్నెట్‌ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!

ఇంటర్నెట్‌ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ తన ప్లాట్‌ఫామ్‌ను ఆల్‌-ఇన్‌-వన్‌గా రూపుదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. ఆ దిశగా కొత్త కొత్త ఫీచర్లు జోడిస్తోంది. తాజాగా ఇంటర్నెట్‌ లేకున్నా ఫొటోలు, వీడియోలను షేర్‌ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇకపై నెట్‌వర్క్‌తో సంబంధం లేకున్నా మీ డాక్యుమెంట్లను పంపించొచ్చు.ఈ ఫీచర్‌ ఎనేబల్‌ చేసుకోవాలంటే వాట్సప్‌ సిస్టమ్‌ ఫైల్‌, ఫొటోల గ్యాలరీ యాక్సెస్‌ లాంటి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది.