ChotaNews Quick Feeds

నేడు సీఎం జగన్ బస్సు యాత్ర షెడ్యూల్ ఇదే..

నేడు సీఎం జగన్ బస్సు యాత్ర షెడ్యూల్ ఇదే..

AP: ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్‌ ఉదయం 9 గంటలకు ఎస్‌టీ రాజపురం నుంచి బయలుదేరుతారు. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు క్రాస్ చేరుకుంటారు. అనంతరం ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు కాకినాడ-అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభ అనంతరం గొడిచర్ల క్రాస్ రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.

పశ్చిమ పవర్‌ ఎవరిది?

పశ్చిమ పవర్‌ ఎవరిది?

సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత కీలక రాష్ట్రం ఉత్తర్‌‌ప్రదేశ్‌. ఇక్కడ ఆధిక్యం సాధించే పార్టీయే దాదాపుగా కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. ఈ రాష్ట్రంలో మొత్తం ఏడు విడతల్లో పోలింగ్‌ జరగనుంది. శుక్రవారం తొలి విడతలో భాగంగా ముస్లింల ప్రాబల్యమున్న పశ్చిమ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని 8 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. ఇక్కడ బీజేపీ హిందుత్వపై ఆధారపడుతుండగా.. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఇండియా కూటమి బరిలోకి దిగింది.

నేటి నుంచి ‘వీఐటీఈఈఈ’ ప్రవేశ పరీక్షలు

నేటి నుంచి ‘వీఐటీఈఈఈ’ ప్రవేశ పరీక్షలు

వేలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీలో బీటెక్‌ కోర్సులో చేరేందుకు వీఐటీ.. ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలను(వీఐటీఈఈఈ) నిర్వహిస్తోంది. నేటి నుంచి ఈనెల 30 వరకు వీఐటీ వేలూరు, చెన్నై, ఏపీ(అమరావతి), భోపాల్‌లో పరీక్షలుంటాయని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా 125 నగరాలతోపాటు దుబాయ్, మస్కట్, ఖతార్‌,కువైట్, సింగపూర్‌, కౌలాలంపూర్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. మే 3న వెబ్‌సైట్‌లో ఫలితాలు విడుదల చేయనున్నట్లు వివరించింది.