ChotaNews Quick Feeds

హైదరాబాద్‌ దండయాత్ర కొనసాగేనా?

హైదరాబాద్‌ దండయాత్ర కొనసాగేనా?

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ అదరగొడుతోంది. ఈ సీజన్‌లో తాను నెలకొల్పిన ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు రికార్డు(277)ను హైదరాబాద్‌(287) బద్దలు కొట్టింది. నేడు ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌లో 287 పరుగుల రికార్డును బ్రేక్ చేసి 300 పరుగులు చేయాలి అన్నట్లు హైదరాబాద్ ఫ్యాన్స్ తయారు చేసిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరలవుతోంది.

TDP అభ్యర్ధులపై విజయసాయి కీలక వ్యాఖ్యలు

TDP అభ్యర్ధులపై విజయసాయి కీలక వ్యాఖ్యలు

AP : నెల్లూరు YCP ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ TDP అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రూ.1000 కోట్లు, నెల్లూరు సిటీ అభ్యర్థి నారాయణ రూ.500 కోట్లు ఖర్చు పెడతారట అని ఆరోపించారు. TDP నేతలు ఇచ్చే డబ్బును తీసుకోవాలని… ఓటు మాత్రం YCPకి వేయాలని ఓటర్లకు సూచించారు.

మేకప్ కిట్ ధరకే 5జీ ఫోన్..!

మేకప్ కిట్ ధరకే 5జీ ఫోన్..!

తక్కువ ధరలో కొత్త 5జీ ఫోన్‌ను కొనుక్కోవాలనుకునే అందరికి ఒక గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ‘మోటోరోలా జీ84 5జీ’ స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్ ఆఫర్లను ఇస్తుంది. ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో తెచ్చింది. 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది. మరిన్ని వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.