ChotaNews Quick Feeds

కవిత కడిగిన ముత్యంలా బయటికి వస్తారు: కేసీఆర్

కవిత కడిగిన ముత్యంలా బయటికి వస్తారు: కేసీఆర్

TG: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కేవలం ప్రధాని మోదీ సృష్టేనని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కవిత కడిగిన ముత్యంలా బయటికి వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్సీలకు బెయిల్ ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి దేశం విడిచి పారిపోతారా అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ రాజకీయ కక్షతోనే ఈ అరెస్టులు జరిగాయని తెలిపారు.

నా పోటీ ఆయనతోనే: పవన్

నా పోటీ ఆయనతోనే: పవన్

కాకినాడ: పిఠాపురంలో తనపై వంగా గీతను పోటీకి నిలబట్టినా జగన్‌తోనే తన పోటీ అని పవన్ కల్యాణ్ చెప్పారు. తనను గెలిపిస్తే ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అనేలా చేస్తానని అన్నారు. దేశమంతా పిఠాపురం వైపు చూసేలా చేస్తానని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ, అమిత్ షాను తాను నేరుగా వెళ్లి కలవగలననీ, కానీ జగన్‌కు అపాయింట్‌మెంట్ కూడా దొరకదని వ్యాఖ్యానించారు.

వలవాదులకు బ్రిటన్ చెక్

వలవాదులకు బ్రిటన్ చెక్

అక్రమంగా తమ దేశంలోకి వలస వచ్చే వారికి బ్రిటన్ ప్రభుత్వం చెక్ పెట్టింది. మంగళవారం ‘సేఫ్టీ ఆఫ్‌ రువాండా’ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లుతో అక్రమ వలసదారులకు అడ్డకట్టపడనుంది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారందరినీ ఆఫ్రికా దేశం రువాండాకు తరలిస్తారు. బ్రిటన్‌ రాజు చార్లెస్‌-3 ఆమోదం తర్వాత ఇది చట్టంగా మారుతుంది.