ChotaNews Quick Feeds

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

కృష్ణా: మచిలీపట్నం మండలం పెదయదరలో టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సోడిశెట్టి బాలాజీ, టీడీపీ, జనసేన, బీజీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

వికసిత్ భారత్‌లా వికసిత్‌ తెలంగాణ పత్రం: లక్ష్మణ్

వికసిత్ భారత్‌లా వికసిత్‌ తెలంగాణ పత్రం: లక్ష్మణ్

TG: వికసిత్ భారత్ తరహాలో వికసిత్ తెలంగాణ పత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. 21 రాష్ట్రాల్లో ఓటింగ్ సరళి చూస్తుంటే మోదీ మేనియా స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. తెలంగాణలో 12 సీట్లు గెలుస్తామనే నమ్మకం కలుగుతోందని చెప్పారు. కేసీఆర్ బస్సు యాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని స్పష్టం చేశారు.

కీర దోసతో ఎన్ని ప్రయోజనాలో ?

కీర దోసతో ఎన్ని ప్రయోజనాలో ?

ఆరోగ్యానికి కీరదోసకాయ మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కీరదోసకాయలో మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్, ఐరన్ వంటి విటమిన్లు ఉన్నాయి. దీనిని తినడం వల్ల కిడ్నీల్లో రాళ్లు కరిగిపోయి. మూత్ర సమస్యలు తగ్గుతాయి. కీరదోసతో శరీరంలో వేడిని తగ్గిస్తుంది. డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. షుగర్‌ను అదుపులో ఉంచేందుకు దోహద పడుతుంది. బ్లడ్ ప్రెజర్‌ను తగ్గించి.. వేసవిలో శరీరం డీహైడ్రేషన్ అవ్వకుండా కాపాడుతుంది.