ChotaNews Quick Feeds

చిరంజీవి చేతుల మీదుగా ‘భజే వాయు వేగం’ టీజర్

చిరంజీవి చేతుల మీదుగా ‘భజే వాయు వేగం’ టీజర్

యువ నటుడు కార్తీకేయ నటిస్తున్న కొత్త చిత్రం ‘భజే వాయు వేగం’. ఈ చిత్ర టీజర్‌ను నటుడు చిరంజీవి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఫిలిప్పీన్స్‌కు చేరుకున్న మొదటి బ్రహ్మోస్ క్షిపణి

ఫిలిప్పీన్స్‌కు చేరుకున్న మొదటి బ్రహ్మోస్ క్షిపణి

2022లో భారత్, ఫిలిప్పీన్స్‌ మధ్య 375 మిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఆయుధాల కొనుగోలు ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా భారత్ పంపించిన మొదటి బ్రహ్మోస్ క్షిపణి.. ఫిలిప్పీన్స్‌కు చేరుకుంది. భారత్ ఎగుమతి చేసిన మొట్టమొదటి బ్రహ్మోస్ క్షిపణి ఇదే కావడం విశేషం. కాగా త్వరలోనే ఈ క్షిపణులను లక్నోలో తయారు చేయనున్నారు.

హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ లాభంలో 44% వృద్ధి

హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ లాభంలో 44% వృద్ధి

గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎంసీ) నికర లాభం 44% పెరిగి రూ.541.10 కోట్లకు చేరింది. 2022-23 ఇదే త్రైమాసికంలో రూ.376.10 కోట్ల నికర లాభాన్ని సంస్థ నమోదుచేసింది. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.637.80 కోట్ల నుంచి 33% పెరిగి రూ.851 కోట్లకు చేరింది. కంపెనీ ఆస్తుల విలువ సగటున రూ.6.13 లక్షల కోట్లుగా ఉంది.