ChotaNews Quick Feeds

బాలినేనికి మద్దతు తెలుపుతూ దిల్ రాజు వీడియో

బాలినేనికి మద్దతు తెలుపుతూ దిల్ రాజు వీడియో

AP: వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డికి మద్దతు తెలుపుతూ నిర్మాత దిల్ రాజు ఒక వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ‘‘ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన సీనియర్ నాయకుడికి ఓటు వేసి గెలిపించాలి’’ అని ఆయన కోరారు.

మెరిసిన భారత అథ్లెట్లు

మెరిసిన భారత అథ్లెట్లు

దుబాయ్‌ వేదికగా జరుగుతున్న 21వ ఆసియా అండర్‌-20 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు పతకాల పంట పండించారు. జావెలిన్‌ త్రోలో 70.29 మీటర్లు విసిరిన దీపాన్షు శర్మ స్వర్ణం గెలవగా.. 70.03 మీటర్లతో భారత్‌కే చెందిన రోహన్‌ యాదవ్‌ రజతం సాధించాడు. పురుషుల 1500 మీటర్ల పరుగు పందేన్ని 3 నిమిషాల 50.85 సెకన్లలోనే పూర్తి చేసిన ప్రియాన్షు రజతం నెగ్గాడు. పురుషుల డిస్కస్‌ త్రోలో రితిక్‌ రజతంతో మెరిశాడు.

కోటక్‌ బ్యాంక్‌పై RBI ఆంక్షలు

కోటక్‌ బ్యాంక్‌పై RBI ఆంక్షలు

ప్రైవేటు రంగానికి చెందిన కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు ఆర్‌బీఐ షాకిచ్చింది. ఆన్‌లైన్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ ఛానల్స్‌ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపై ఆంక్షలు విధించింది. అలాగే కొత్తగా క్రెడిట్‌ కార్డుల జారీని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. 2022, 2023 సంవత్సరాల్లో రిజర్వ్ బ్యాంక్ ఐటీ పరిశీలనలో గుర్తించిన లోపాలను సమగ్రంగా, సమయానుకూలంగా పరిష్కరించడంలో బ్యాంకు విఫలమైనందునకు ఈ చర్యలు చేపట్టినట్లు ఆర్‌బీఐ పేర్కొంది.