ChotaNews Quick Feeds

ఇరాన్‌తో ఒప్పందాలా? జాగ్రత్త..!: అమెరికా

ఇరాన్‌తో ఒప్పందాలా? జాగ్రత్త..!: అమెరికా

ఇరాన్‌తో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునే యోచనలో ఉన్న దేశాలు పునరాలోచించుకోవాలని అగ్రరాజ్యం అమెరికా సూచించింది. లేనిపక్షంలో ఆంక్షలు తప్పవని మంగళవారం హెచ్చరించింది. పాక్‌ పర్యటనలో ఉన్న ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాకిస్థాన్‌ ప్రధాని షెహ్‌బాజ్‌ షరీఫ్‌ సోమవారం చర్చలు జరిపారు. వారి సమక్షంలో ఎనిమిది ఒప్పంద పత్రాలపై ఇరుదేశాల ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా ఈ వ్యాఖ్యలు చేసింది.

బస్సు యాత్రతో పూర్వ వైభవం వచ్చేనా?

బస్సు యాత్రతో పూర్వ వైభవం వచ్చేనా?

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. నల్లగొండలోని మిర్యాలగూడ నుంచి నేడు బస్సు యాత్ర చేయనున్నారు. ఈ యాత్ర బీఆర్ఎస్‌కు పూర్వవైభవం తెస్తుందా? లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను సాధించేలా చేస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో కేడర్ పక్కచూపులు చూస్తున్న తరుణంలో కేసీఆర్ యాత్రకు స్పందన ఎలా ఉంటుందనేది చర్చనీయాంశమైంది.

తనిఖీల్లో ఎంత  సొత్తు స్వాధీనం అంటే

తనిఖీల్లో ఎంత సొత్తు స్వాధీనం అంటే

TG : రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.155కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రూ. 61కోట్ల 11లక్షల నగదు‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. 28 కోట్ల 92 లక్షల విలువైన మద్యం, రూ.23 కోట్ల 87లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.