ChotaNews Quick Feeds

భార్య మందలించడంతో భర్త ఆత్మహత్య

భార్య మందలించడంతో భర్త ఆత్మహత్య

కామారెడ్డి: భార్య డాన్స్ వేయొద్దని మందలించిదని క్షణికావేశంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిజాంసాగర్ మండలం చిన్నఆరెపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన చెన్నబోయిన అనిల్(28) గ్రామంలోని పెళ్లికి వెళ్లాడు. పెళ్లిలో డాన్స్ చేయకంటూ భార్య మందలించడంతో క్షణికావేశంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తాం: చంద్రబాబు

పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తాం: చంద్రబాబు

కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.ఏటా 6500 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఒక్కసారైన భర్తీ చేసిందా అని ప్రశ్నించారు.మెగా డీఎస్సీ అని చెప్పిన జగన్ నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వస్తే తొలి సంతకం డీఎస్సీపైనే చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు టీసీఎస్ గుడ్‌న్యూస్

ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు టీసీఎస్ గుడ్‌న్యూస్

ఐటీ దిగ్గజం టీసీఎస్(TCS) కొత్త ఉద్యోగుల(ఫ్రెషర్స్) నియమాకాలను చేపట్టబోతోంది. నింజా(Ninja), డిజిటల్(Digital), ప్రైమ్(Prime) కేటగిరీల కోసం ఈ నియామకాలను ప్రారంభించనుందని ‘మనీ కంట్రోల్’ కథనం తెలిపింది. దీని ప్రకారం.. దరఖాస్తులకు చివరితేదీ ఏప్రిల్ 10గా ఉంది. ఏప్రిల్ 26న టెస్ట్ జరుగుతుందని పేర్కొంది. 2024కి చెందిన బీటెక్, బీఈ, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంఎస్ బ్యాచ్‌ల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పేర్కొంది.