ChotaNews Quick Feeds

IPL: హైదరాబాద్‌పై బెంగళూరు ఘన విజయం

IPL: హైదరాబాద్‌పై బెంగళూరు ఘన విజయం

ఐపీఎల్-17వ సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులకే పరిమితమైంది. హైదరాబాద్ బ్యాటర్లలో షాబాజ్‌ అహ్మద్‌ (40*), అభిషేక్‌ శర్మ (31), కమిన్స్‌ (31) చెలరేగారు. బెంగళూరు బౌలర్లలో స్వప్నిల్‌ సింగ్‌ 2, కర్ణ్‌ శర్మ 2, గ్రీన్‌ 2, జాక్స్‌ 1, దయాల్‌ 1 వికెట్ తీశారు. 

30 వైడ్‌ బాడీ విమనాలకు ఇండిగో ఆర్డర్‌

30 వైడ్‌ బాడీ విమనాలకు ఇండిగో ఆర్డర్‌

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో వైడ్‌ బాడీ విమానాలకు ఆర్డర్‌ పెట్టింది. దేశీయ విమాన సర్వీసుల్లో ఎయిరిండియా, విస్తారా వైడ్‌ బాడీ కలిగిన విమానాలను నడుపుతుండగా.. స్పైస్‌జెట్‌ కొన్ని విమానాలను లీజుకు తీసుకుని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా తన ఉనికిని మరింత విస్తరించాలని చూస్తున్న ఇండిగో.. ఎయిర్‌‌బస్‌ నుంచి 30 ఏ350-900 విమానాలను కొనుగోలుకు ఆర్డర్‌ పెట్టింది. 2027 నుంచి వీటి డెలివరీలు ప్రారంభంకానున్నాయి.

ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఇదే..

ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఇదే..

ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మే 3న పీలేరు, విజయవాడలో, 4న రాజమండ్రి, అనకాపల్లిలో ప్రధాని పర్యటించనున్నారు. 3న మధ్యాహ్నం 2:45కి పీలేరు, సాయంత్రం 6:30కి విజయవాడలో రోడ్‌షో నిర్వహించనున్నారు. 4న మధ్యాహ్నం 3:45కి రాజమండ్రి, సాయంత్రం 6 గంటలకు అనకాపల్లిలో మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పాల్గొంటారని సమాచారం.