ChotaNews Quick Feeds

ట్రాఫిక్‌లో ఇరుక్కున్న అంబులెన్స్

ట్రాఫిక్‌లో ఇరుక్కున్న అంబులెన్స్

అనకాపల్లి: సీఎం జగన్ ‘మేము సిద్ధం’ సభ సందర్భంగా కసింకోట మండలం తాళ్లపాలెం జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో 108 అంబులెన్స్ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయింది. అక్కడున్నవారంతా ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి యత్నించినా ఫలితం లేకపోవడంతో చాలాసేపు అంబులెన్స్ ట్రాఫిక్ జామ్‌లోనే ఉండవలసి వచ్చింది.

లంచాల్లేని పాలన కావాలంటే.. వైసీపీ రావాలి: సీఎం జగన్

లంచాల్లేని పాలన కావాలంటే.. వైసీపీ రావాలి: సీఎం జగన్

ఏపీలో లంచాలు, అవినీతికి తావులేని పాలన కావాలంటే.. వైసీపీ రావాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా నరసింగపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ‘‘రైతన్నలకు రైతుభరోసా, నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్సకారులకు మత్య్సకార భరోసా, సొంత వాహనాలు ఉ‍న్న డ్రైవర్లకు వాహనమిత్ర, ఓ చేదోడు, ఓ తోడు, ఓ లా నేస్తం వంటి పథకాలు అమలుకావాలంటే ఏపీలో మళ్లీ వైసీపీ గెలవాలి’’ అని అన్నారు.

VIDEO.. చెట్టెక్కిన మంత్రి జూపల్లి

VIDEO.. చెట్టెక్కిన మంత్రి జూపల్లి

కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం, రాష్ట్రంలో గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించాయని, అందుకే గులాబీ పార్టీకి తెలంగాణ‌ ప్ర‌జ‌లు బుద్ది చెప్పారని, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లోనూ క‌మ‌లం పార్టీని ఓడించాల‌ని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు కోరారు. బోడబండ తాండలో మంత్రి జూప‌ల్లి చెట్టు ఎక్కి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. గిరిజ‌న మ‌హిళ‌లు, వృద్దుల‌తో స‌ర‌ద‌గా మాట్లాడుతూ.. త‌న చిన్న నాటి జ్ఞాప‌కాల‌ను నెమ‌రువేసుకున్నారు.