ChotaNews Quick Feeds

నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు

నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు

AP : TDP అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో నామినేషన్‌ పత్రాలను ఉంచి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీపురంలోని మసీదు ఆవరణలో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత బాబూ నగర్‌లోని చర్చిలో ప్రార్థనలు చేశారు.

మళ్లీ కలిసిన అమితాబ్‌ ,రజనీ

మళ్లీ కలిసిన అమితాబ్‌ ,రజనీ

రజనీకాంత్‌ , అమితాబ్‌ బచ్చన్‌ 3 దశాబ్దాల తర్వాత ‘వేట్టయాన్‌’ కోసం మళ్లీ కలిసి పని చేస్తున్నారు. ‘జై భీమ్‌’ ఫేమ్‌ టి.జె.జ్ఞానవేల్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ అక్టోబరులో విడుదల కానుంది.

సీరియల్ నటికి రోడ్డు ప్రమాదం

సీరియల్ నటికి రోడ్డు ప్రమాదం

బాలీవుడ్ బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠికి రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన దివ్యాంకను ముంబైలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఆమె చేతి ఎముకలు విరగడంతో శస్త్రచికిత్స చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె భర్త వివేక్ దహియా వెల్లడించారు. ‘యే హై మొహబ్బతీన్’ సీరియల్‌‌తో దివ్యాంక గుర్తింపు సాధించారు. విషయం తెలిసిన బాలీవుడ్‌ తారలు దివ్యాంక కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు.