ChotaNews Quick Feeds

అవనిగడ్డలో వైసీపీకి భారీ షాక్

అవనిగడ్డలో వైసీపీకి భారీ షాక్

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో అధికార వైసీపీకి భారీ షాక్ తగిలింది. భారీ అనుచర గణంతో దివంగత మత్స్యకార నేత సైకం అర్జునరావు వర్గీయులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు సమక్షంలో ఎదురుమొండి, సంగమేశ్వరం, కమ్మనమోలు గ్రామాల ప్రజలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

డీకే శివకుమార్‌పై కేసు నమోదు

డీకే శివకుమార్‌పై కేసు నమోదు

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌పై కేసు నమోదైంది. బెంగళూరు రూరల్ ఎంపీ స్థానం నుంచి పోటీచేస్తున్న తన సోదరుడు డీకే సురేశ్ తరఫున ప్రచారంలో పాల్గొన్న డీకే శివకుమార్ మాట్లాడుతూ.. ‘‘నా సోదరుడు సురేశ్‌ను గెలిపిస్తేనే.. చేసి మీకు అవసరమైన నీటిని కేటాయిస్తాం’’ అని ఓటర్లతో అన్నారు. ఇది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని బీజేపీ నేతలు ఫిర్యాదుచేయడంతో పోలీసులు కేసు నమోదుచేశారు.

టాస్ గెలిచిన ఢిల్లీ.. SRH బ్యాటింగ్

టాస్ గెలిచిన ఢిల్లీ.. SRH బ్యాటింగ్

IPL: ఢిల్లీ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. వరుస విజయాలతో ఊపు మీద ఉన్నSRH ఈ మ్యాచ్‌లో కూడా పరుగుల వరద పారిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.