ChotaNews Quick Feeds

ఫెయిల్యూర్స్ లేని ప్రయోగాలే లక్ష్యం: ఇస్రో ఛైర్మన్

ఫెయిల్యూర్స్ లేని ప్రయోగాలే లక్ష్యం: ఇస్రో ఛైర్మన్

2030 నాటికి ఫెయిల్యూర్స్, అవాంతరాలు లేని అంతరిక్ష ప్రయోగాలే లక్ష్యమని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ అన్నారు. ‘‘రాబోయే రోజుల్లో స్పేస్ మిషన్లకు స్పష్టమైన ప్రణాళిక రూపొందించాం. ప్రస్తుతం అంతరిక్ష కక్ష్యలో దేశానికి చెందిన 54 స్పేస్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. మరికొన్ని వినియోగంలో లేనివి ఉన్నాయి’’ అని తెలిపారు.

విజయ్‌ సినిమాలో దివంగత నటుడు!

విజయ్‌ సినిమాలో దివంగత నటుడు!

నటుడు విజయ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’. ఏఐ ద్వారా దివంగత నటుడు కెప్టెన్‌ విజయకాంత్‌ను ఈ సినిమాలో చూపించినున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. దీనిపై ఆయన సతీమణి ప్రేమలత స్పందించారు.‘ది గోట్‌’లో ఓ సన్నివేశంలో విజయకాంత్‌ రూపం తెరపై కనిపించనుందని చెప్పారు. విజయ్‌, అతడి తండ్రి ఎస్‌.ఎ.చంద్రశేఖర్‌ అంటే విజయకాంత్‌కు అభిమానమని గుర్తు చేశారు.

IPL: క్రిస్‌ గేల్‌ రికార్డును బ్రేక్ చేసిన బట్లర్

IPL: క్రిస్‌ గేల్‌ రికార్డును బ్రేక్ చేసిన బట్లర్

ఐపీఎల్‌-2024లో భాగంగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు స్టార్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ కీలకపాత్ర పోషించాడు. తద్వారా ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా బట్లర్‌ రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో వెస్టిండీస్‌ దిగ్గజం గేల్‌ (6 సెంచరీలు)రి​కార్డును బట్లర్ బ్రేక్‌ చేశాడు. ఈ జాబితాలో తొలి స్ధానంలో ఆర్సీబీ స్టార్‌ విరాట్‌ కోహ్లి (8) ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో బట్లర్‌ (7) నిలిచాడు.