ChotaNews Quick Feeds

కోటక్‌ బ్యాంక్‌పై RBI ఆంక్షలు

కోటక్‌ బ్యాంక్‌పై RBI ఆంక్షలు

ప్రైవేటు రంగానికి చెందిన కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు ఆర్‌బీఐ షాకిచ్చింది. ఆన్‌లైన్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ ఛానల్స్‌ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపై ఆంక్షలు విధించింది. అలాగే కొత్తగా క్రెడిట్‌ కార్డుల జారీని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. 2022, 2023 సంవత్సరాల్లో రిజర్వ్ బ్యాంక్ ఐటీ పరిశీలనలో గుర్తించిన లోపాలను సమగ్రంగా, సమయానుకూలంగా పరిష్కరించడంలో బ్యాంకు విఫలమైనందునకు ఈ చర్యలు చేపట్టినట్లు ఆర్‌బీఐ పేర్కొంది.

మే మొదటి వారంలో ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం

మే మొదటి వారంలో ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం

AP: మే మొదటి వారంలో ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్నట్టు బీజేపీ హైకమాండ్ తెలిపింది. మే 3, 4 తేదీల్లో ఏపీలో ప్రధాని పర్యటన ఉంటుందని వెల్లడించింది. నేటితో రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండగా, ఎన్నికల ప్రచారంలో జోరు పెంచాలని కూటమి నిర్ణయించింది. ఇప్పటికే చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఉత్సాహంగా ప్రచారం చేస్తుండగా.. ప్రధాని మోదీ కూడా వస్తే కూటమిలో మరింత జోష్ వస్తుందని భావిస్తున్నారు.

జేఈఈ మెయిన్‌-2 ఫలితాలు విడుదల

జేఈఈ మెయిన్‌-2 ఫలితాలు విడుదల

జేఈఈ మెయిన్‌-2 సెషన్‌ ఫలితాలు విడుదలయ్యాయి. రెండు సెషన్లకు కలిపి NTA ర్యాంకులను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 2.5లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేసింది. కేటగిరీల వారీగా కటాఫ్‌ను సైతం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 56 మంది 100 పర్సంటైల్‌ స్కోరు సాధించారు.వారిలో తెలంగాణ నుంచి 15 మంది, ఏపీ నుంచి ఏడుగురున్నారు. NTA అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ నంబర్, పుట్టినతేదీ, సెక్యూరిటీపిన్ ఎంటర్ చేసి ఫలితాలను పొందొచ్చు.