KCR లిల్లీపుట్ మాటలు మానుకో: మల్లురవి
TG: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నేత, నాగర్ కర్నూల్ అభ్యర్థి మల్లురవి సెటైర్లు వేశారు. కేసీఆర్ అహంకారంతో తెలంగాణ దివాళా తీసిందన్నారు. కేసీఆర్ వెనక ఎవ్వరూ లేరని.. అందరూ రేవంత్ నాయకత్వంలో పనిచేయాలనుకుంటున్నారని తెలిపారు. కవితను జైలు నుంచి విడిపించుకునేందుకు.. బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. కేసీఆర్ లిల్లీపుట్ మాటలు మాని బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలని సూచించారు.