ChotaNews Quick Feeds

'రూ.600 కూలి ఇవ్వాలి'

'రూ.600 కూలి ఇవ్వాలి'

నాగర్‌కర్నూల్: ప్రభుత్వాలు ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు రోజుకు రూ.600 కూలి ఇవ్వాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్రాములు డిమాండ్ చేశారు. నారాయణపేట మండలం పెరపళ్ళ, శాసన్‌పల్లి గ్రామాలలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలను కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలను తెలుసుకున్నారు.

ప్రజలకు ఎల్‌ఐసీ అలర్ట్‌!

ప్రజలకు ఎల్‌ఐసీ అలర్ట్‌!

ప్రభుత్వ రంగానికి చెందిన జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ బుధవారం పబ్లిక్‌ నోటీసు జారీ చేసింది. ఎల్‌ఐసీతో పాటు, సంస్థకు చెందిన వ్యక్తుల పేర్లతో వివిధ సామజిక మాధ్యమ ఖాతాల్లో మోసపూరిత ప్రకటనలు వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఇలాంటి ప్రకటనలపై ప్రజలు, పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టింది.

స్వదేశానికి రానున్న వేల మంది ఎన్నారైలు!

స్వదేశానికి రానున్న వేల మంది ఎన్నారైలు!

లోక్‌సభ ఎన్నికల పండగలో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రవాస భారతీయులు ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా కేరళ నుంచి విదేశాలకు వెళ్లినవారిలో.. వేల మంది స్వదేశీ బాట పట్టారు. ఇందుకోసం ప్రత్యేక విమానాలను ఆశ్రయిస్తున్నారు. గత రెండు రోజుల్లోనే దాదాపు 22వేలకు పైగా ఎన్నారైలు కేరళకు వచ్చినట్లు అంచనా. పోలింగ్‌ తేదీ నాటికి ఈ సంఖ్య భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది.