ఆ రాష్ట్రంలో పెరగనున్న మందు రేట్లు
కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల్లో ఇచ్చిన 5 హామీలను నెరవేర్చడానికి ఏడాదికి సుమారు రూ.56వేల కోట్లు అవసరం కానుండడంతో.. ఆదాయ వనరులు సమకూర్చుకునేందుకు మద్యం రేట్లు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. మద్యంపై 10-15శాతం సుంకం విధించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో అల్కాహాల్ ధరలు పెరగనున్నాయి.