ChotaNews Quick Feeds

కన్నుల పండుగగా శ్రీశైల గిరి ప్రదక్షిణ

కన్నుల పండుగగా శ్రీశైల గిరి ప్రదక్షిణ

కర్నూలు: శ్రీశైలంలో చైత్రశుద్ధ పౌర్ణమి పురస్కరించుకొని దేవస్థానం సాంప్రదాయపద్ధంగా శ్రీశైల గిరిప్రదక్షిణను నిర్వహించింది. స్వామి అమ్మవార్ల మహామంగళహారతి అనంతరం ఉత్సవమూర్తులను ధర్మప్రచార రథంలో ఆసీనులను చేసి విశేషపూజలు చేశారు. అనంతరం ధర్మప్రచార రథంలో శ్రీగిరి ప్రదక్షిణ చేపట్టారు. ప్రధాన ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం నుంచి ప్రారంభమై గంగాధర మండపం వద్దకు చేరుకోవడంతో గిరిప్రదక్షిణ ముగిసింది.

రాహుల్ గాంధీ సీరియస్ పొలిటీషియన్ కాదు: సీఎం

రాహుల్ గాంధీ సీరియస్ పొలిటీషియన్ కాదు: సీఎం

ఇండియా కూటమిలో భాగంగా ఉన్న సీపీఎం, మిత్ర పక్షం కాంగ్రెస్‌పై విరుచుకుపడుతోంది. జాతీయస్థాయిలో ఈ రెండు పార్టీల మధ్య సంబంధాలు బాగానే ఉన్నా, కేరళలో మాత్రం విభేదాలు కనిపిస్తున్నాయి. బీజేపీతో సీఎం విజయన్ చేతులు కలిపారన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. రాహుల్ సీరియస్ పొలిటీషియన్ కాదని..దేశంలో కీలక రాజకీయ పరిణామాలు జరిగినప్పుడు ఆయన చాలాసార్లు గైర్హాజరయ్యారని సీఎం ఆరోపించారు.

బీఆర్ఎస్ దుకాణం బంద్ : సంజయ్

బీఆర్ఎస్ దుకాణం బంద్ : సంజయ్

TG: కేసీఆర్ బస్సు యాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మరని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. జూన్ 4న బీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందని జోస్యం చెప్పారు. గతంలో చేసిన అరాచకాలు, మోసాలతో ప్రజలు విసిగిపోయారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎంత మొసలి కన్నీరు కార్చినా, పొర్లు దండాలు పెట్టినా ఉపయోగం ఉండదని తెలిపారు.