ChotaNews Quick Feeds

శంషాబాద్ విమానాశ్రయంపై పీటర్సన్ ప్రశంసలు

శంషాబాద్ విమానాశ్రయంపై పీటర్సన్ ప్రశంసలు

ఇటీవల బెంగళూరు విమానాశ్రయంపై ప్రశంసలు కురిపించిన ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ పీటర్సన్ హైదరాబాద్ విమానాశ్రయం చూసి ముగ్ధుడయ్యాడు. శంషాబాద్ విమానాశ్రయం నిర్వహణ తీరుపై ప్రశంసలు కురిపించాడు. SRH, MI జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన ‘ప్రపంచంలోని పలు గొప్ప విమానాశ్రయాల్లో ఇది ఒకటి. ఇక్కడి టెక్నాలజీ, పరిశుభ్రత, షాపింగ్, ఫ్రెండ్లీ నేచర్ చాలా స్వచ్ఛంగా ఉన్నాయ`ని పేర్కొన్నాడు.

ఆ నిందితులపై రూ.10 లక్షల రివార్డు

ఆ నిందితులపై రూ.10 లక్షల రివార్డు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో నిందితుల కోసం ఎన్ఐఏ గాలింపు కొనసాగుతోంది. పేలుళ్లకు సూత్రధారులైన ముసావీర్ హుస్సేన్, అబ్దుల్ మంతెన్‌లు పరారీలో ఉన్నారని తెలిపింది. ముజ్మిల్ అనే మరొకరిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. పరారీలో ఉన్న నిందితుల వివరాలు చెప్పిన వారికి రూ.10 లక్షల రివార్డు అందిస్తామని తెలిపింది.

టైటిల్‌కు అడుగు దూరంలో బోపన్న జోడీ

టైటిల్‌కు అడుగు దూరంలో బోపన్న జోడీ

అమెరికాలో జరుగుతున్న మియామి ఓపెన్ టోర్నీలో మెన్స్ డబుల్స్‌లో భారత సీనియర్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న, ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. సెమీస్‌లో బోపన్న జోడీ 6-1, 6-4 తేడాతో గ్రానోల్లెర్స్(స్పెయిన్)- జెబాలోస్(అర్జెంటీనా) జంటను చిత్తు చేసింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌ కేవలం 53 నిమిషాల్లోనే ముగిసింది.